Hyderabad, జూలై 21 -- రఘువరన్ బీ టెక్ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ధనుష్ ఇప్పుడు తెలుగు హీరోగా మారిపోయాడు. సార్, కుబేర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ మనసు దోచాడు. దీంతో ధనుష్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ పెరిగింది.

ఇక ఇటీవల కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధనుష్ రొమాంటిక్ డ్రామా చిత్రాన్ని మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఆ సినిమానే మిస్టర్ కార్తీక్. తమిళంలో తెరకెక్కిన మయక్కమ్ ఎన్న సినిమాను 2016లో తెలుగులో మిస్టర్ కార్తీక్‌గా అనువదించారు.

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీ రాఘవ మిస్టర్ కార్తీక్ సినిమాకు దర్శకత్వం వహించారు. హీరో ధనుష్‌కు జోడీగా రవితేజ మిరపకాయ్ బ్యూటీ రీచా గంగోపాధ్యాయ హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెర...