భారతదేశం, మే 7 -- తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు బుధవారం ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు అందినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పర్యటనతో మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్‌లతో కలిసి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన పిలుపు కావడంతో.. తెలంగాణలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో మంత్...