భారతదేశం, ఏప్రిల్ 18 -- క్విడ్ ప్రోకో పెట్టుబడులు, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన రూ.27.5 కోట్ల విలువైన వాటాలు, దాల్మియా సిమెంట్స్ (భారత్) లిమిటెడ్ యాజమాన్యంలోని రూ.377.2 కోట్ల విలువైన భూమిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ యూనిట్ తాత్కాలికంగా అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తి విలువ రూ.793.3 కోట్లు అని డీబీసీఎల్ వెల్లడించింది. కేసు నమోదు చేసిన 14 సంవత్సరాల తర్వాత ఈ అటాచ్‌మెంట్ జరిగింది.

2011లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసిన కేసు నుండి.. ఈడీ తాత్కాలిక అటాచ్‌మెంట్ వచ్చింది. డీబీసీఎల్‌.. భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టింది. కార్మెల్ ఆసియా హోల్డింగ్స్ లిమిటెడ్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, మరో సంస్థలో వైఎస్ జ...