Hyderabad, సెప్టెంబర్ 8 -- టాలీవుడ్‌లో కామెడీ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ తర్వాత అంతటి స్థానాన్ని భర్తీ చేస్తూ కామెడీ సినిమాలతో దూసుకుపోయాడు అల్లరి నరేష్. అయితే, గత కొంతకాలంగా సీరియస్ రోల్స్‌లో నటించిన అల్లరి నరేష్ మెప్పించారు.

ఇప్పుడు మరోసారి తిరిగి కామెడీ జోనర్‌లోకి వచ్చేశాడు అల్లరి నరేష్. యూనిక్ కాన్సెప్ట్స్‌తో ఆకట్టుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అల్లరి నరేష్ కెరీర్‌లో 65వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కనుంది.

ఈ ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్‌‌కు చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్నారు. నరేష్ 65 సినిమా ఫాంటసీ, కామెడీ బ్లెండ్‌తో రిఫ్రెషిం...