భారతదేశం, మే 16 -- ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ -19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్ ల్లో కొరోనా కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయికి పెరుగుతున్నాయి. దాంతో ఆయా దేశాల ఆరోగ్య శాఖల అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

హాంకాంగ్ జనాభా సుమారు 70 లక్షలు. ఈ నగరంలో కొరోనా వైరస్ చురుగ్గా వ్యాపిస్తోందని అధికారులు చెబుతున్నారు. నగరంలోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ లోని కమ్యూనికబుల్ డిసీజ్ బ్రాంచ్ హెడ్ ఆల్బర్ట్ ఓ మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. ఏజెన్సీ డేటా ప్రకారం, కోవిడ్ -19 పాజిటివ్ పరీక్షించిన శ్వాసకోశ నమూనాల శాతం ఇటీవల ఈ సంవత్సరంలో గరిష్టానికి చేరుకుంది.

హాంకాంగ్ లో మరణాలతో సహా తీవ్రమైన కేసులు కూడా ఏడాదిలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మే 3 వరకు వారంలో 31 ...