భారతదేశం, జూలై 15 -- మలైకా అరోరా.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫిట్‌నెస్‌కు, ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్‌. మలైకా నిరంతరం యోగా సాధన చేస్తూ, దాని ప్రయోజనాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో 'హఠ యోగా సూర్య నమస్కారం' గురించి వివరించారు. దీని వల్ల కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను కూడా ఆమె విపులంగా తెలియజేశారు. ముఖ్యంగా చర్మం మెరవడానికి, బరువు అదుపులో ఉంచుకోవడానికి ఈ ఆసనం ఎంతగానో సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు.

మలైకా ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోను పంచుకుంటూ, సమయం తక్కువగా ఉన్నా పూర్తి శరీరానికి వ్యాయామం కావాలంటే ఈ హఠ సూర్య నమస్కారాన్ని ప్రయత్నించమని సూచించారు. "మీ సామర్థ్యాన్ని బట్టి 12 నుంచి 24 రౌండ్లు చేయవచ్చు" అని ఆమె తెలిపారు. ఈ వీడియోలో మలైకా సరైన భంగిమలో, శ్వాసను నియంత్రిస్తూ...