భారతదేశం, జూలై 21 -- వయసుతో సంబంధం లేకుండా నిత్యం యువరాణిలా మెరిసిపోతూ.. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచే మలైకా అరోరా, ప్రస్తుతం ఇటలీలోని సిసిలీలో తన వేసవి సెలవులను ఆస్వాదిస్తోంది. అక్కడి సమ్మర్‌ను ఎంజాయ్ చేస్తూ, స్నేహితులతో సరదాగా గడుపుతున్న ఆమె, తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలలో మలైకా పింక్ ప్రింటెడ్ బికినీలో కనిపించి అభిమానుల మనసు దోచుకుంది.

జూలై 20న తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాలిడే పిక్స్‌ను షేర్ చేస్తూ, "పింక్ [బికినీ, రెండు హార్ట్ ఎమోజీలు]" అని మలైకా క్యాప్షన్ ఇచ్చింది. లెటోజానిలోని 'నుఓవా స్పియాజియా పారాడిసో' అనే రెస్టారెంట్‌లోని పూల్ పక్కన మలైకా ఎంతో సంతోషంగా కనిపించింది. సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ, రిలాక్స్డ్‌గా ఉన్న మలైకా లుక్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

ఈ అవుటింగ్‌లో ఆమె ధరించిన పింక్ ప...