భారతదేశం, జూలై 21 -- వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతుంది అనుకునే వారికి మలైకా అరోరా ఒక సవాల్ విసురుతోంది. 51 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా మెరిసిపోతున్న ఆమె అందం వెనుక ఉన్న రహస్యాన్ని తాజాగా బయటపెట్టింది. మేకప్ వేసుకునే ముందు తాను చేసే కొన్ని పనుల గురించి ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

జులై 20న మలైకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. "మేకప్ వేసుకునే ముందు చర్మాన్ని సిద్ధం చేసుకుందాం" అనే శీర్షికతో ఉన్న ఆ వీడియోలో, ఆమె తన మెరిసే చర్మం వెనుక ఉన్న సాధారణ బ్యూటీ సీక్రెట్స్‌ను వెల్లడించింది. అవేంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం.

"నేను నూనెను ఉపయోగించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఇది చర్మానికి తేమను అందిస్తుంది. రోలర్ ముఖంపై సులభంగా జారుతుంది" అని మలైకా చెప్పింది. వీడియోలో ఆమె...