Hyderabad, ఆగస్టు 21 -- మలయాళం థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్. ఇప్పుడో మలయాళం కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గురువారం (ఆగస్టు 21) ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా పేరు సూత్రవాక్యం (Soothravakyam). ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో నటించిన ఈ సినిమాకు ఐఎండీబీలో 8.3 రేటింగ్ ఉండటం విశేషం.

ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ సూత్రవాక్యం. ఇదో డిఫరెంట్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ గురువారం (ఆగస్టు 21) ఈటీవీ విన్ ఓటీటీలోకి తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది.

"ప్రతి కుటుంబం ఓ రహస్యాన్ని దాచి పెడుతుంది.. కానీ నిజం బయటపడినప్పుడు ఏం జరుగుతుంది? సూత్రవాక్యం ఇప్పుడు కేవలం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఓ తెలుగు పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

సూత్రవాక్యం మూవీ జూన...