Hyderabad, జూన్ 30 -- జియోహాట్‌స్టార్ సోమవారం (జూన్ 30) తమ రాబోయే దేశభక్తి చిత్రం 'సర్జమీన్' (Sarzameen) మొదటి లుక్‌ను విడుదల చేసింది. ఈ మూవీలో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఇబ్రహీం అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జియోహాట్‌స్టార్ తమ యూట్యూబ్ ఛానెల్‌లో ఒక నిమిషం పైగా నిడివి ఉన్న వీడియోను పంచుకుంది.

జియోహాట్‌స్టార్ ఓటీటీ సర్జమీన్ పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో క్లిప్‌లో.. పృథ్వీరాజ్ సుకుమారన్ దేశానికి ప్రాధాన్యతనిచ్చే కఠినమైన, నిజాయతీ గల ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించాడు. కాజోల్ అతని భార్యగా నటించింది. ఆమె పలు రకాల ఎమోషన్స్ తో ఫైట్ చేస్తున్నట్లు ఈ వీడియోలో చూపించారు. సరిహద్దులో పృథ్వీరాజ్ శత్రువులతో పోరాడుతుండగా.. కాజోల్ ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తుంది.

ప్రముఖ బా...