Hyderabad, సెప్టెంబర్ 18 -- మలయాళం హారర్ కామెడీ మూవీ సుమతి వలవు (Sumathi Valavu) ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఓ రోడ్డు మలుపును కాపు కాసే తమిళ దెయ్యం అనే డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు జీ5 ఓటీటీ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతోంది.

మలయాళ హారర్ కామెడీ మూవీ పేరు సుమతి వలవు. అంటే సుమతి మలుపు అని అర్థం. ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో రిలీజైంది. మూవీ డిజిటల్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ మూవీని సెప్టెంబర్ 26 నుంచి ఈ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.

ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.25 కోట్లకుపైగా వసూలు చేసింది. మలయాళం ఇండస్ట్రీలో ఇది చాలా పెద్ద మొత్తమే. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. హారర్ కామెడీ సినిమాలకు ఓటీటీలో ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ సినిమాకు కూడా మంచి...