Hyderabad, ఆగస్టు 28 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మురా (Mura). ప్రముఖ నటుడు సూరజ్ వెంజరమూడు లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు 9 నెలల తర్వాత మరో ఓటీటీలోకి కూడా వస్తోంది.

మలయాళం యాక్షన్ థ్రిల్లర్ సినిమా మురా శుక్రవారం (ఆగస్టు 29) నుంచి సన్ నెక్ట్స్ (Sun Nxt) ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "ఒక రాత్రి. ఒక లాకర్. ఒక షాట్ వాళ్ల జీవితాలను మార్చేస్తోంది.

మురా రేపటి నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, తమిళంలలోనూ స్ట్రీమింగ్ కానుంది. గతేడాది నవంబర్ లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల తర్వాత అంటే డి...