Hyderabad, జూన్ 6 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన మరో బ్లాక్‌బస్టర్ మూవీ ఆలప్పుర జింఖానా (Alappuzha Gymkhana). ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర రూ.65 కోట్లకుపైగా వసూలు చేసింది. రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ప్రేమలు మూవీ ఫేమ్ నస్లేన్ గఫూర్ లీడ్ రోల్లో నటించిన మూవీ ఆలప్పుర జింఖానా. ఇదో కామెడీ స్పోర్ట్స్ డ్రామా. ఖాలిద్ రెహమాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 13 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (జూన్ 6) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది.

"మార్కుల కోసం ట్రైనింగ్ అయిన వాళ్లు.. అంతకంటే చాలా ఎక్కువైన దాని కోసం ఫైట్ చేసిన ఈ గ్రూపును చూడండి. ఆలప్పుర జింఖానా జూన్ 13 నుం...