Hyderabad, జూలై 8 -- మలయాళీ స్టార్ టొవినో థామస్ తన తాజా మూవీ 'నరివెట్ట'లో ప్రదర్శించిన అద్భుతమైన నటనకు ప్రశంసలు దక్కాయి. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ శుక్రవారం (జులై 11) నుండి సోనీలివ్ లో 'నరివెట్ట' స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో టొవినో థామస్ నటించిన ఈ అద్భుతమైన సినిమాలను ఓటీటీలో తప్పక చూడండి. ఈ మూవీస్ ప్రస్తుతం సోనీ లివ్, జీ5లాంటి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్, 2018లో కేరళను అతలాకుతలం చేసిన భారీ వరదల భయంకరమైన వాస్తవికతను ఈ మలయాళం మూవీ ద్వారా కళ్లకు కట్టాడు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి సాహసించిన మంచి మనుషుల గురించి ఈ 2018 మూవీ చర్చిస్తుంది. టొవినో థామస్ ఇందులో అనూప్ అనే పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కుంచకో బోబన్, ఆసిఫ్ అలీ, లాల్ కూడా నటించారు.

టొవినో థ...