భారతదేశం, డిసెంబర్ 19 -- ఓటీటీలోకి సుమారు ఏడాది తర్వాత ఓ మలయాళం థ్రిల్లర్ మూవీ అడుగుపెట్టింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ ఏడాది నటించిన తొలి సినిమా ఇది. మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ అయింది. ఈ మూవీ పేరు డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్. ఈ సినిమా స్ట్రీమింగ్ విశేషాలేంటో చూడండి.

మమ్ముట్టి నటించిన డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ శుక్రవారం (డిసెంబర్ 19) నుంచి జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఒరిజినల్ మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. నిజానికి ఈ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని ఆ ఓటీటీ ముందుగా వెల్లడించలేదు. సడెన్ గా తెలుగులోనూ తీసుకొచ్చి ఆశ్చర్యపరిచింది.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా 11 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఇది 2025 జనవరి 23న థియేటర్లలో రిలీజైంది. ఇందులో మమ్ముట్టి, గోకుల్ సురేష్, స...