Hyderabad, జూన్ 12 -- మలయాళం థ్రిల్లర్ మూవీ ఆజాదీ (Azadi) గత నెలలో థియేటర్లలో రిలీజైనా ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. హత్య కేసులో ఇరుక్కొని జైలు జీవితం గడుపుతున్న ఓ మహిళ తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

మలయాళం థ్రిల్లర్ మూవీ ఆజాదీ మే 23న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను జూన్ 27 నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కు ముందే డిజిటల్ హక్కులను ఈ ఓటీటీ సొంతం చేసుకుంది.

మలయాళం ఇండస్ట్రీలో ఇలా జరగడం చాలా అరుదు. చాలా వరకు మలయాళం సినిమాలు థియేటర్లలో రిలీజైన తర్వాతే డిజిటల్ పార్ట్‌నర్ ను కన్ఫమ్ చేస్తాయి. కానీ ఆజాదీ మూవీని మనోరమ మ్యాక్స్ ముందే దక్కించుకుంది.

ఆజాదీ మూవీని జో జార్జ్ డైరెక్ట్ చేశాడు. ఇందులో మంజుమ్మెల్ బాయ్స్...