Hyderabad, ఆగస్టు 29 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా వస్తూనే ఉంటుంది. అలా గతేడాది ఆగస్టులో వచ్చిన సినిమా ఫుటేజ్ (Footage). ఫౌండ్ ఫుటేజ్ ఆధారంగా ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తొలి మూవీ ఇది. అయితే ఏడాది తర్వాత ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది.

మలయాళం సీనియర్ నటి మంజు వారియర్ నటించిన సినిమా ఫుటేజ్. ఈ మూవీ సెప్టెంబర్ 5 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. గతేడాది ఆగస్టు 23న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఏడాది తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఓనమ్ సందర్భంగా మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ శుక్రవారం (ఆగస్టు 29) వెల్లడించింది.

"లెన్స్ నుంచి చూస్తే ఏదీ దాగి ఉండలేదు. మీరు కేవలం చూడం లేదు.. మీరు నిఘా పెడుతున్నారు. దానిని సెప్టెంబర్ 5 నుంచి సన్ నెక్ట్స్ లో చూడండి" అనే క్యా...