Hyderabad, మే 29 -- క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రెండేళ్ల కిందట వచ్చిన మలయాళం వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్. మలయాళంలో రూపొందిన తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గురువారం (మే 29) తెలుగులోనూ రానున్న ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సీపీవో అంబిలి రాజు కోసం జరగబోయే అన్వేషణ అంటూ ఈ కొత్త సీజన్ ను పరిచయం చేశారు.

కేరళ క్రైమ్ ఫైల్స్ రెండో సీజన్ ట్రైలర్ 1 నిమిషం 53 సెకన్ల పాటు ఉంది. ఓ హత్య, మిస్సింగ్ కేసు చట్టూ ఈ కొత్త సీజన్ తిరగనున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ కేసులో కొందరు పోలీస్ ఆఫీసర్లే అనుమానితులు అన్నట్లుగా ట్రైలర్ మొదట్లోనే కొందరిని సస్పెండ్ చేసినట్లు చూపించారు. అజు వర్గీస్, లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఇది.

ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన కేస్ ...