Hyderabad, జూలై 15 -- మలయాళ మూవీ 'అస్త్ర' థియేటర్లలో విడుదలై ఏడాదిన్నరకు పైనే అయింది. మొత్తానికి ఇప్పుడు డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. అమిత్ చకలకల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తేదీ ఇప్పుడు ఖరారైంది.

మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ అస్త్ర (Asthra). డిసెంబర్ 2023లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ మూవీ వచ్చే శుక్రవారం (జులై 18) నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ కన్ఫమ్ చేసింది.

ఇదే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ త్వరలో ధ్యాన్ శ్రీనివాసన్ 'సూపర్ జిందగీ', అనస్వర రాజన్ 'వ్యాసనాసమేతమ్ బంధుమిత్రాదిగల్' చిత్రాలను కూడా స్ట్రీమింగ్ చేయనుంది. వినయ్ ఫోర్ట్, షరాఫ్ యు దీన్ నటించిన 'సంశయం' కూడా ఈ ప్లాట్...