భారతదేశం, డిసెంబర్ 2 -- స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ రోజుకు 8 గంటల పని డిమాండ్ పై చర్చ కొనసాగుతూనే ఉంది. ఆమె చేసిన ఈ డిమాండ్ వల్ల ప్రభాస్ 'స్పిరిట్', 'కల్కి' సీక్వెల్ నుంచి తప్పుకున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. అసలు సినిమా రంగంలో ఇలాంటి నిబంధనలు ఆచరణ సాధ్యమేనా అనే విషయంపై 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' రౌండ్ టేబుల్ సమావేశంలో నటులు రానా, దుల్కర్ సల్మాన్, నిర్మాత అర్చన కళాపతి తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.

పని గంటల గురించి అడిగినప్పుడు రానా దగ్గుబాటి నవ్వుతూ స్పందించారు. ఇది సాధ్యం కాదని అతడు స్పష్టం చేశాడు. "ఇది ఒక ఉద్యోగం కాదు. ఇదొక లైఫ్ స్టైల్. మీరు ఇందులో ఉండాలా వద్దా అనేది మీ ఛాయిస్. ప్రతి సినిమాకు వేర్వేరు అవసరాలు ఉంటాయి. ఇదేమీ ఫ్యాక్టరీ కాదు కదా.. 8 గంటలు కూర్చుంటే గొప్ప సీన్ వచ్చేయడానికి.. కథను సృష్టించ...