Hyderabad, ఏప్రిల్ 20 -- ఈ రోజుల్లో మలబద్దకం అనేది సాధారణ సమస్యగా మారింది. పిల్లలు, పెద్దలు అంతా దీని బారిన పడి శారీరక ఇబ్బందితో పాటు మనోవేధనకు గురవుతున్నారు. కొందరిలో సకాలంలో చికిత్స తీసుకోకపోవడం వల్ల ఇతర సమస్యలకు కారణమవుతుంది కూడా. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య ఎవరికైనా వచ్చే ప్రమాదముంది. ముఖ్యంగా ఆహారంలో ఫైబర్ లోపం ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది.

కొన్ని కూరగాయల వల్ల కూడా ఈ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మలబద్దకం సమస్యకు కారణమయ్యే 4 రకాల కూరగాయల గురించి తెలుసుకుందాం. సమస్య ఉందని తెలిసిన వారు ఆ కూరగాయాలేంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటం మంచిది. అవేంటంటే..

బెండకాయను చాలా మంది పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని నిర్మాణం జిగురుగా, పదునుగా ఉంటుంది. కొంతమందికి ఇది మంచి ఫైబర్ మూలం అయినప్పటికీ, మరికొందరి...