భారతదేశం, ఆగస్టు 14 -- రేణుకాస్వామి మర్డర్​ కేసులో కన్నడ నటుడు దర్శన్​ బెయిల్​ని సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టేసింది.

2024లో రేణుకాస్వామిని దర్శన్​ హత్య చేసినట్టు ఆరోపణలు రావడంతో, ఆయన్ని పోలీసులు అరెస్ట్​ చేశారు. కాగా దర్శన్​కి డిసెంబర్​లో హైకోర్టు బెయిల్​ని మంజూరు చేసింది.

2024 జూన్‌లో 33 ఏళ్ల రేణుకాస్వామి అనే అభిమాని నటి పవిత్రా గౌడకు అశ్లీల సందేశాలు పంపాడని ఆరోపణలు వచ్చాయి. దీనితో దర్శన్, పవిత్రా గౌడతో పాటు మరికొందరు రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, మూడు రోజుల పాటు బెంగళూరులోని ఒక షెడ్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. అతను మరణించిన తర్వాత మృతదేహాన్ని మురుగు కాలువలో పడేశారు. పోలీసులు ఈ హత్య కేసులో దర్శన్‌తో పాటు పవిత్రా గౌడ, మరికొందరిని నిందితులుగా చేర్చారు.

ఈ కేసులో కర్ణాటక...