భారతదేశం, డిసెంబర్ 22 -- బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27న 60వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడు షేర్ చేసిన లేటెస్ట్ జిమ్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వయసు పెరుగుతున్నా ఫిట్‌నెస్ తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అతడు 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' అనే వార్ మూవీ కోసం కసరత్తులు చేస్తున్నాడు.

బాలీవుడ్ ఖాన్ త్రయం (షారుఖ్, ఆమిర్, సల్మాన్)లో చివరగా సల్మాన్ ఖాన్ ఈ ఏడాది 60వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. మరో ఆరు రోజుల్లో అంటే డిసెంబర్ 27న అతడు షష్టిపూర్తి చేసుకోనున్నాడు. ఈ సందర్భంగా సల్మాన్ చేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

సల్మాన్ ఖాన్ తన జిమ్ ఫోటోలను షేర్ చేస్తూ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టాడు. "ఇంకా 6 రోజుల్లో నాకు 60 ఏళ్లు వస్తున్నాయి.. అప్పటికి నేను ఇలాగే (ఫి...