భారతదేశం, నవంబర్ 3 -- కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఆరు నెలలు కాల్పుల విరమణ పొడిగించనున్నట్టుగా ప్రకటించింది. తెలంగాణలోని అన్ని పార్టీలు, ప్రజా సంస్థలు, సామాజిక ఉద్యమాలు శాంతియుత వాతావరణం కొనసాగింపు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలను ప్రారంభించాయని పార్టీ అధికారిక ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టిందన్నారు.

గత మే నెలలో 6 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించామని, అదే విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలలు కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు. 'మే నెలలో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించాం. ఈ ఆరు నెలలు కూడా మా వైపు నుండి అదే వ్యూహాన్ని అమలు చేస్తాం. శాంతియుత వాతావరణం ...