భారతదేశం, డిసెంబర్ 3 -- ప్రజా పాలన ప్రజా వియోజత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో రూ.262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనస్వాగతం పలికారు. హుస్నాబాద్ సభకు మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకట్ స్వామి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సంజయ్ కుమార్, సిరిసిల్ల రాజయ్య, ఇనగాల వెంకట్రామిరెడ్డి , ఇతర ముఖ్య నేతలు హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. 'మా ప్రభుత్వంలో ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అతి త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తాం. రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హుస్నాబాద్ నుంచి బ...