భారతదేశం, డిసెంబర్ 20 -- రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్నిచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయంతో పాటు సాయంత్రం దాటితే చాలు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు ఇదే మాదిరి పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాబోయే 3 రోజులు తెలంగాణలోని పలుచోట్ల శీతల గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడకక్కడ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.

డిసెంబర్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక హైదరాబాద్ లోని వాతావరణం చూస్తే... ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచుతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉపరితల గాలులు ఈశాన్య దిశలో గంటకు 4-6 కిమీ వేగంతో వీచ...