భారతదేశం, జనవరి 21 -- జంతు ప్రేమికులు కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న వరుస సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కుక్కలను వందల సంఖ్యలో చంపడంపై ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తూనే ఉంది. మరోవైపు కుక్కలను చంపడం మాత్రం ఆపడం లేదు. హైదరాబాద్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని యాచారం గ్రామంలో 100 కుక్కలకు విషం ఇచ్చి చంపేసిన ఘటన ఇప్పుడు బయటకు వచ్చింది.

దీంతో స్థానిక సర్పంచ్, మరో ఇద్దరు పంచాయతీ ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వరుస వీధి కుక్కల హత్యలతో తెలంగాణలో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జనవరి 6 నుండి అనేక జిల్లాల్లో దాదాపు 500 ఇలాంటి మరణాలు నమోదయ్యాయి.

స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక జంతు సంక...