భారతదేశం, సెప్టెంబర్ 7 -- గత కొద్దిరోజులుగా ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ. కొరత లేకుండా పంపిణీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ.. అధిక సంఖ్యలో ఎరువులను దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది.

శనివారం ఎరువుల లభ్యత, సరఫరా అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 77,396 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఆదివారం(సెప్టెంబర్ 8) కాకినాడ పోర్టుకు ఒక షిప్ వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు . దీని నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇవి కాకుండా మరో 10 రోజుల్లో 41 వేల టన్నుల ఎరువులు రానున్నాయని ప్రకటించారు. రై...