భారతదేశం, జనవరి 11 -- మరో సంక్రాంతి సినిమా రిలీజ్ కు సై అంటోంది. శర్వానంద్ హీరోగా నటించిన 'నారీ నారీ నడుమ మురారి' మూవీ ట్రైలర్ ను ఇవాళ (జనవరి 11) మేకర్స్ రిలీజ్ చేశారు. పంచ్ డైలాగ్ లు, మీమ్స్ తో ఈ ట్రైలర్ కడుపుబ్బా నవ్వించేలా ఉంది. అంతే కాకుండా ఇళయరాజాపై ఓ కౌంటర్ కూడా ఉంది. మరోవైపు మూవీ రిలీజ్ టైమ్ లో ఓ ట్విస్ట్ కూడా ఉంది.

సంక్రాంతి 2026 రేసులోకి రాబోతున్న మరో సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ మూవీ జనవరి 14న రిలీజ్ కానుంది. పండగ రోజున ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతుంది. ఈ మూవీ ట్రైలర్ ను ఆదివారం రిలీజ్ చేశారు మేకర్స్. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే మగాడిగా శర్వానంద్ నటించాడు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఫుల్ కామెడీతో సాగిపోతుంది.

ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా నారీ నారీ నడుమ మురారి ట్రైలర్ ను రెడీ చేశారు. సత్య ఒక మహిళను హాస్పిటల్ కు ఆటోలో తీసుకొచ్చ...