భారతదేశం, ఏప్రిల్ 22 -- సినీ నటుడు అల్లు అర్జున్ మరో వివాదం చిక్కుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అనంతరం పరిణామాలపై ఇప్పుడిప్పుడు బయటపడుతున్న అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలేలా ఉంది. హీర్ అల్లు అర్జు్న్, హీరోయిన్ శ్రీలీలపై ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లు అర్జున్, శ్రీలీల పలు కార్పొరేట్ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా చేస్తున్నారని, వీరు ఆయా కాలేజీల విద్యా ప్రమాణాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా త‌ప్పుడు ప్రక‌ట‌న‌లు చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొ్న్నారు. నిన్న ఏపీలో ఫిర్యాదులో చేసిన ఏఐఎస్ఎఫ్ తాజాగా తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. అల్లు అర్జున్, శ్రీలీల ప్రకటనలతో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు తీవ్రంగా న‌ష్టపోతున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కార్పొరేట్ కాలేజీల నుండి భారీ పారితోషికం తీస...