భారతదేశం, జూన్ 25 -- తెలుగులోనూ ఈ మధ్య కొత్త కొత్త కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయి. యంగ్ డైరెక్టర్లు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో సత్తాచాటేందుకు ట్రై చేస్తున్నారు. అలా వచ్చిందే 'ఘటికాచలం' సినిమా. ఈ చిన్న సినిమాను డైరెక్టర్ మారుతి సమర్పించడం, ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో అంచనాలు కలిగాయి. కానీ థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. అయితేనేం ఓటీటీలో అదరగొడుతోంది.

జూన్ 20న ఓటీటీలోకి వచ్చింది ఘటికాచలం సినిమా. ఒకే సారి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఓటీటీలో ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తోంది. అందుకే ఇప్పుడు మరో రెండు భాషల్లోకి ఈ సినిమాను డబ్ చేశారు.

కేవలం తెలుగులోనే థియేటర్లలో రిలీజై, ఓటీటీలోకి వచ్చేసిన ఘటికాచలం సినిమా ఇప్పుడు మరో రెండు భాషల్లోనూ అందుబాటులో ఉంది. అమెజాన్...