భారతదేశం, సెప్టెంబర్ 9 -- నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతున్న కామెడీ వెబ్ సిరీస్ 'లియాన్' సీజన్ 2 కూడా వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ సిరీస్ సీజన్ 1 ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు సీజన్ 2 కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

జూలై 31, 2025 న కామెడీ వెబ్ సిరీస్ లియాన్ ఫస్ట్ సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టింది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చినప్పటి నుంచి ఈ సిరీస్ కు మంచి ఆదరణ దక్కుతోంది. విడుదలైనప్పటి నుంచి ఈ సిరీస్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. నెట్‌ఫ్లిక్స్‌ గ్లోబల్ టాప్ 10 లో రెండు వారాలు ట్రెండింగ్ లో కొనసాగింది. 13 దేశాలలో టాప్ 10 చార్టులలో కనిపించింది.

లియాన్ కామెడీ వెబ్ సిరీస్ లో లియాన్ మోర్గాన్, క్రిస్టెన్ జాన్సన్, సెల్లా వెస్టన్, బ్లేక్ క్లార్క్, ర్యాన్ స్టిల్స్, గ్రాహం రోజర్స్, హన్నా ప్లైక్స్ తదితరులు నటించారు....