Hyderabad, మే 16 -- తమిళంలో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వంటి జోనర్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు మూవీతో కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పాపులారిటీ సాధించాడు. బిచ్చగాడు 2 సినిమాతో మరో సక్సెస్ అందుకుని పలు రొమాంటిక్ మూవీస్‌తో కూడా విజయ్ ఆంటోనీ మెప్పించాడు.

ఇప్పుడు మరో మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో అలరించడానికి విజయ్ ఆంటోనీ రెడీగా ఉన్నాడు. విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ 'మార్గన్'. లియో జాన్ పాల్ కథ, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, హీరో భార్య మీరా విజయ్ ఆంటోని సగర్వంగా సమర్పిస్తున్నారు.

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌గా రానున్న ఈ మార్గన్ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్...