భారతదేశం, అక్టోబర్ 27 -- ఆహా వీడియో ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ తెలుగు కామెడీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ (అదిరే అభి) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ లీడ్ రోల్ పోషించాడు. తాజాగా సోమవారం (అక్టోబర్ 27) మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

రాజ్ తరుణ్ లీడ్ రోల్లో నటించిన మూవీ చిరంజీవ. కుషితా కల్లాపు ఫిమేల్ లీడ్ గా నటించింది. ఈ సినిమా నవంబర్ 7న నేరుగా ఆహా వీడియో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. గతంలోనే సినిమా స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసిన ఈ ప్లాట్‌ఫామ్.. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. "వచ్చినవాడు చిరంజీవ.. చిరంజీవ నవంబర్ 7న ఆహాలో ప్రీమియర్ అవుతుంది. ట్రైలర్ వచ్చేసింది" అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ ను ట్వీట్ చేసింది.

ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగా సాగిపోయింది. ఓ అంబులెన్స్ డ్రైవర్ గా ఉన్న హీరో ...