భారతదేశం, జూన్ 15 -- సండేను ఫుల్ ఫన్ డే గా మార్చేందుకు మ్యాడ్ స్క్వేర్ మూవీ టీవీలోకి వచ్చేస్తోంది. ఈ రోజు (జూన్ 15) స్టార్ మాలో ఈ మూవీ టీవీ ప్రీమియర్ కానుంది. మరో గంటలోనే ఈ సినిమా టీవీల్లోకి వచ్చేస్తోంది. ఫుల్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రిలీజైన మ్యాడ్ మ్యాక్స్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో నవ్వులు చిందిస్తూనే కలెక్షన్ల దుమ్ము రేపింది. 28 మార్చి 2025న థియేటర్లలో రిలీజైంది ఈ మూవీ.

మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ఈ రోజు టీవీలోకి రాబోతోంది. సాయంత్రం 6.30 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ఈ సినిమా టీవీ ప్రీమియర్ సందర్భంగా స్టార్ మా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంది. అప్ డేట్స్ ఇస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ.66 కోట్లు కలెక్ట్ చేసింది. ఏప్రిల్ 25న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది ఈ మూవీ.

ఇంజ...