భారతదేశం, జనవరి 27 -- ఆది పినిశెట్టి లీడ్ రోల్లో నటించిన సినిమా డ్రైవ్ (Drive). ఈ థ్రిల్లర్ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో ఓటీటీలోకి కూడా అడుగుపెడుతోంది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఐఎండీబీలో మాత్రం 7.8 రేటింగ్ సంపాదించి ప్రేక్షకుల ఆదరణ సంపాదించిన సినిమా ఇది.

ఓ చిన్న సినిమాగా రిలీజై ఎవరూ పట్టించుకోకపోవడంతో బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది డ్రైవ్ మూవీ. ఈ సినిమా ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీలోకి కూడా వస్తోంది. ఈ శుక్రవారం (జనవరి 30) నుంచి మూవీని ఇందులో చూడొచ్చు. ఇప్పటికే ప్రైమ్ వీడియోలోనూ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

"ప్రతి సీక్రెట్ కు ఓ మూల్యం ఉంటుంది. ఎప్పుడూ ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు" అనే క్యాప్షన్ తో డ్రైవ్ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఆహా వీడియో ఓటీటీ ట్వీట్ చేసింది....