భారతదేశం, డిసెంబర్ 13 -- తెలుగు రొమాంటిక్ మూవీ 'శశివదనే' మరో ఓటీటీలోకి వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతున్న ఈ సినిమా ఇంకో ప్లాట్ ఫామ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ రొమాంటిక్ మూవీ థియేటర్లలో యూత్ ఆడియన్స్ ను అలరించింది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోనూ సత్తాచాటుతోంది.

రూరల్ లవ్ స్టోరీ శశివదనే మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా నవంబర్ 28న సన్ నెక్ట్స్ ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలోనూ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది. రొమాంటిక్ మూవీ శశివదనేలో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించారు.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ స్టోరీ శశివదనే. గోదావరి లంక గ్రామంలో ఉండే ఓ సాధారణ యువకుడు రాఘవ (రక్షిత్). తల్లి చనిపోవడంతో తండ్రి (శ్రీమాన్) అన్నీ తాన...