భారతదేశం, నవంబర్ 8 -- ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. వాటిలో నిన్న ఒక్కరోజే సుమారుగా 20 వరకు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో తెలుగులో కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ సైతం ఓటీటీ ప్రీమియర్ అయ్యాయి. వాటిలో ఒకటి స్పోర్ట్స్ బయోపిక్ డ్రామా చిత్రం.

తెలుగులో అన్ని రకాల జోనర్ సినిమాలు చాలానే వస్తున్నాయి. కానీ, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో బయోగ్రాఫికల్‌గా వచ్చే సినిమాలు చాలా తక్కువ. అలా రీసెంట్‌గా థియేటర్లలో విడుదలైన సినిమానే అర్జున్ చక్రవర్తి. నల్గొండ కబడ్డీ ప్లేయర్ నాగులయ్య జీవిత కథ ఆధారంగా అర్జున్ చక్రవర్తి సినిమాను రూపొందించినట్లు ప్రమోషన్స్‌లలో మేకర్స్ తెలిపారు.

తెలుగు బయోపిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన అర్జున్ చక్రవర్తి సినిమాలో హీరోగా విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించాడు. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించారు. శ్రీన...