భారతదేశం, ఏప్రిల్ 30 -- మరో ఓటీటీలోకి ఓ తెలుగు మూవీ వచ్చేస్తోంది. రిలీజైన ఏడాది తర్వాత ఇంకో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. 2024లో వచ్చిన తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ 'ఓం భీమ్ బుష్' ఏ రేంజ్ లో ప్రేక్షకులను నవ్వించిందో తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నవ్వులతో కలెక్షన్లు అదరగొట్టింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఇప్పుడు మరో ఓటీటీలోకి రాబోతోంది.

శ్రీ విష్ణు, ప్రియదర్శి రాహుల్ రామ‌కృష్ణ‌ లీడ్ రోల్స్ ప్లే చేసిన 'ఓం భీమ్ బుష్' మూవీ 2024 మార్చి 22న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసే అల్లరి, తింగరి పనులు ఫ్యాన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే మూవీలో ఓ మహల్, దెయ్యంతో పెళ్లి లాంటి విషయాలు నవ్వుతూనే థ్రిల్ ను పంచాయి.

థియేటర్లలో బంపర్ హిట్ గా నిలిచిన 'ఓం భీమ్ బుష్' ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓట...