భారతదేశం, నవంబర్ 3 -- ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు రావడం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతివారం సరికొత్త సినిమాలతో పాటు డిఫరెంట్ జోనర్స్‌లు రిలీజ్ అవుతున్నాయి. అలా రీసెంట్‌గా తమిళంలో డిఫరెంట్ కామెడీ థ్రిల్లర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఆ సినిమా పేరే బాంబ్.

సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన బాంబ్ సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అలాగే, ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7 రేటింగ్ సాధించుకుంది. బాంబ్ సినిమాలో పవన్ కల్యాణ్ ఓజీ మూవీ నటుడు అర్జున్ దాస్ హీరోగా చేశాడు.

అలాగే, టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా చేసింది. అర్జున్ దాస్, శివానీ రాజశేఖర్ జోడీ కట్టిన బాంబ్ సినిమాకు విశాల్ వెంకట్ దర్శకత్వం వహించారు. మణికందన్ మాధవన్, అభిషేక్ సబారిగిరిసన్, విశాల్ వెంకట్ కథ అంద...