Hyderabad, సెప్టెంబర్ 18 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు, కుజుడు ద్విద్వాదశ దృష్టి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం శుభ ఫలితాలను తీసుకువస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సూర్యుడు, కుజుడు 30 డిగ్రీల వద్ద సెప్టెంబర్ 23న సంయోగం చెందుతున్నారు. దీంతో ద్విద్వాదశ దృష్టి యోగం ఏర్పడనుంది. ఇది మేషరాశి, కర్కాటక రాశి, సింహ రాశి, కన్యా రాశి, తులా రాశి వారికి శుభ ఫలితాలను తీసుకు రానుంది. ఈ రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలను పొందనున్నారు. మరి ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారు? ఎవరికి ఏ విధంగా కలిసి వస్తుంది వంటి ఆసక్తికరమైన వ...