భారతదేశం, నవంబర్ 1 -- విద్య, అభివృద్ధి సహా అనేక రంగాల్లో దూసుకెళుతూ దేశవ్యాప్తంగా నిత్యం వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం మరో అద్భుతం చేసింది! భారత దేశంలో.. అతి పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా చరిత్రకెక్కింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ శనివారం కీలక ప్రకటన చేశారు. కేరళ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

నేటి సాయంత్రం 5 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ఈ ఘనతను అధికారికంగా ప్రకటించనున్నారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులందరూ హాజరుకావాల్సి ఉంది. ప్రతిపక్ష నాయకుడిని కూడా ఈ వేడుకకు ఆహ్వానించారు.

ఈ ఈవెంట్​కు ప్రముఖ సినీ నటులు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

రాష్ట్ర ప్రభు...