భారతదేశం, మే 12 -- ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై మెరిసిన ఆర్ఆర్ఆర్ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఆర్ఆర్ఆర్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మూవీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

లండన్ లోని ఫేమస్ రాల్ ఆల్బర్ట్ హాల్ లో లైవ్ కాన్సర్ట్ చేసిన ఫస్ట్ వీదేశీ మూవీ గా 'బాహుబలి 2' అప్పట్లో హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు బాహుబలి 2 తర్వాత ఆ ఛాన్స్ ఆర్ఆర్ఆర్ కే దక్కింది. ఈ రెండు సినిమాలకు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అన్న సంగతి తెలిసిందే. లండన్ లో జరిగిన ఆర్ఆర్ఆర్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఎంతో స్పెషల్ గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ లోని 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే...