భారతదేశం, మే 4 -- ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న 'స్పిరిట్' మూవీపై క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్ గా నిలిచిన ప్రభాస్-అనుష్క మరోసారి ఈ మూవీ కోసం జతకట్టనున్నారని టాక్. స్పిరిట్ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని సమాచారం. ఇందులో అనుష్క ఒకరినే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ప్రభాస్-అనుష్క ఇప్పటివరకూ నాలుగు సినిమాల్లో రొమాన్స్ చేశారు. బిల్లా, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లో ఈ జోడీ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసింది. ప్రభాస్ కు అనుష్క పర్ ఫెక్ట్ మ్యాచ్ అని అభిమానులు అందరూ ఫీల్ అవుతున్నారు. ఆ మధ్యలో ప్రభాస్-అనుష్క పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జోరందుకుంది. ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది.

ఇప్పుడు ప్రభాస్-అనుష్క జోడీకి ఉన్న క్రేజ్ ను యూజ్ చేసుకునేందుకు సందీప్ రెడ్డి వంగా ...