భారతదేశం, నవంబర్ 28 -- సినిమాల్లో ఆడవాళ్లను ఆట వస్తువులుగా చూపించడం చాలాకాలంగా వస్తున్నదే. అయితే ఇది కేవలం సౌత్ సినిమాలకే కాదు.. బాలీవుడ్ లోనూ ఉందని రాశీ ఖన్నా అంటోంది. జూమ్‌కి తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్లను కేవలం ఎక్స్‌పోజింగ్ కు మాత్రమే పరిమితం చేసే పాత్రలపై స్పందించింది.

సౌత్ ఇండియా సినిమాలలో మహిళల చిత్రీకరణ గురించి రాశీ ఖన్నా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. "ఇది కేవలం సౌత్ కు పరిమితమైనది మాత్రమే కాదు. నేను దీన్ని నార్త్‌లో కూడా చాలా చూస్తున్నాను. ఇది పూర్తిగా ఆయా నటుల ఛాయిస్ పై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి దానితో ఇబ్బంది ఉండదు. మరికొందరికి ఉంటుంది" అని ఆమె అభిప్రాయపడింది.

"నేను సౌత్‌లో చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. కాబట్టి ఇప్పుడు హిందీలో ఒక అడుగు ముందుకు వేసి కంటెంట్ ఆధారిత పాత్రలలోకి వెళ్లాలని అనుకుంటున్నాను. కమర్షియల్ అంశా...