భారతదేశం, ఫిబ్రవరి 20 -- చాలా కాలంగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న రాకింగ్ స్టార్ యశ్ కొత్త సినిమా 'టాక్సిక్' (Toxic) అప్‌డేట్ వచ్చేసింది. శుక్రవారం (ఫిబ్రవరి 20) ఉదయం మేకర్స్ టాక్సిక్ టీజర్‌ను విడుదల చేశారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు టీజర్ చూస్తుంటే, ఆ అంచనాలను యశ్ వంద శాతం అందుకుంటాడనిపిస్తోంది.

టాక్సిక్ టీజర్ ప్రారంభంలోనే యశ్ పోషిస్తున్న 'రాయ' పాత్రతో ఈ సారి యుద్ధం వేరు, వాళ్ల కుతంత్రాలు వేరు, అందరిదో విరోధం పెట్టుకుని బతకలేవు, పట్టుదల వదిలేయ్, గివప్ రాయా, ఇట్స్ ఓవర్ అని ఎవరో హెచ్చరిస్తారు.

ఆ తర్వాత మొదలయ్యే యాక్షన్ సీక్వెన్స్ మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. అంతేకాకుండా "నేను ఓవర్ అన్నప్పుడే అది ఓవర్. అప్పటివరకు నాకు కొంచెం మ్యానర్స్ ఉన్నాయి" అంటూ యశ్ చెప...