భారతదేశం, జనవరి 6 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా మార్పును తీసుకొస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలు ఎదురైతే, ఇంకొక సారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాల సంచారం అన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

జనవరిలో చూసుకున్నట్లయితే, ఐదు గ్రహాలు ఒకేసారి మకర రాశిలో సంయోగం చెందబోతున్నాయి. మకర రాశిలో ఐదు గ్రహాలు సంయోగం చెందడంతో పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చినా, కొన్ని రాశుల వారికి మాత్రమే ఎక్కువ లాభాలను తీసుకువస్తుంది.

జనవరి 24న పంచగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ అరుదైన యోగం ఏర్పడటం చాలా విశేషం. ఐదు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు ఈ పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. వేద జ్యోతిష్యశాస్త్రం ప...