Hyderabad, సెప్టెంబర్ 9 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. బుధుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. బుధుడు వ్యాపారం, మాట, విజ్ఞానం, ధనం వంటి వాటికి కారకుడు.

సెప్టెంబర్ నెలలో బుధుని అనుగ్రహంతో కొన్ని రాశులు వారు శుభ ఫలితాలను ఎదుర్కోబోతున్నారు. బుధుడు సంచారంలో మార్పు రావడంతో భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అనేక లాభాలను కలిగిస్తుంది.

సెప్టెంబర్ 15న బుధుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో భద్ర మహాపురుష రాజు యోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం నాలుగు రాశుల వారికి అనేక లాభాలను అందిస్తుంది. ఈ నాలుగు రాశుల వారు అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందుతారు. మరి భద్ర మహాపురుష రాజయోగంతో ఏ ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ...