Hyderabad, అక్టోబర్ 13 -- హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి కూడా ఒకటి. దీపావళి ముందు ధన త్రయోదశి వస్తుంది. పంచాంగం ప్రకారం కొన్ని తిధులకు ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ధన త్రయోదశి కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆయుర్వేదానికి మూలపురుషుడైన ధన్వంతుడు భూమి మీద ఉద్భవించిన రోజు ధన త్రయోదశి. అలాగే చాలా మంది ధన త్రయోదశి నాడు బంగారం, వెండి, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎ

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి రోజున ధన త్రయోదశిని జరుపుకుంటాము. ఉత్తరాది వారు దీనిని దంతేరస్ గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18, శనివారం నాడు వచ్చింది. ఆ రోజున లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులను పొందాలని చాలా మంది రకరకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ధన త్రయోదశి నాడు వెండి, బంగారం లాంటి లోహపు వస్తువులను...