Hyderabad, జూన్ 21 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు రాశి మార్పు చెందడం వలన అన్ని రాశుల వారిపై అది ప్రభావం చూపిస్తుంది, కానీ కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహాలక్ష్మి యోగం శుభ యోగం. చాలా రాశుల వారికి మంచి ఫలితాలను అందిస్తుంది.

చంద్రుడు వేగంగా కదలే గ్రహం. రెండున్నర రోజులకు ఒకసారి చంద్రుడు తన రాశిని మారుస్తూ ఉంటాడు. ఈ సమయంలో పలు రాశులతో సంయోగం చెందుతాడు. ఇలా చంద్రుని రాశి మార్పు కారణంగా శుభయోగాలు ఏర్పడతాయి.జూన్ చివరిలో చంద్రుడు సింహ రాశిలోకి వెళ్తాడు. అదే సమయంలో కుజుడుతో సంయోగం చెందడం వలన విశిష్టమైన రాజయోగం ఏర్పడుతుంది.

దానిని చంద్ర కుజ యోగం లేదా మహాలక్ష్మి యోగం అని అంటారు. మహాలక్ష్మి యోగం కారణంగా కొన్ని రాశుల వారికి సంపద పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బ...